చాప్టర్ 5
వ్యవసాయం
- మనం రోజూ తీసుకునే ఆహారం శరీరానికి ఎందుకు ముఖ్యమైనది?సమాధానం: ఆహారం శరీరానికి శక్తి, పెరుగుదల, ఆరోగ్యాన్ని కలిగించడానికి అవసరం.
-
శక్తినిచ్చే ఆహారం అంటే ఏమిటి?సమాధానం: శక్తి ఇచ్చే ఆహారం అనగా పిండిపదార్థాలు, బంగాళదుంప, జొన్న, బెల్లం మొదలైనవి.
-
ప్రోటీన్ వలన శరీరానికి ఏమి లాభం ఉంటుంది?సమాధానం: శరీరపెరుగుదలకు, కండరాల నిర్మాణానికి, శక్తికి సహాయపడుతుంది.
-
సమతుల్య ఆహారం అంటే ఏమిటి?సమాధానం: అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో కలిగి ఉన్న ఆహారం సమతుల్య ఆహారం.
-
సమతుల్య ఆహారంలో ఏ పదార్థాలు ఉండాలి?సమాధానం: పిండిపదార్థాలు, ప్రోటీనులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు.
-
మంచి ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది?సమాధానం: అనారోగ్యం, శక్తి తగ్గడం, చదువు మరియు రోజువారీ కార్యకలాపాలు చేయలేము.
-
పెరుగుదలకు సహాయపడే ఆహార పదార్థాలు ఏమిటి?సమాధానం: పప్పులు, కందులు, శనగలు, మినుములు, గుడ్లు, మాంసం.
-
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?సమాధానం: శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించటం, రోగనిరోధక శక్తిని పెంచడం.
-
పిండిపదార్థాల ఉదాహరణలు చెప్పండి.సమాధానం: వరి, గోధుమ, జొన్న, బంగాళదుంప, చిలగడదుంప.
-
రాగిసంకటి, జొన్న రొట్టెలు, పల్లిచిక్కి ఎందుకు ఉపయోగపడతాయి?సమాధానం: ఇవి శక్తినిచ్చే, పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు.
-
ఎరువులు ఎందుకు అవసరం?సమాధానం: మొక్కల పెరుగుదల, పంట దిగుబడిని పెంచడానికి.
-
సహజ ఎరువుల ఉదాహరణలు చెప్పండి.సమాధానం: కంపోస్ట్, మొక్కల అవశేషాలు, జంతువుల విసర్జితాలు.
-
రసాయన ఎరువులు ఎందుకు ఆపద్ధరణగా వాడకూడదు?సమాధానం: నేల సారాన్ని తగ్గిస్తాయి, పర్యావరణానికి హాని.
-
సస్యరక్షణ ఎందుకు అవసరం?సమాధానం: పంటను కీటకాలు, తెగుళ్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి.
-
గొంగళి పురుగు ఎలా హాని చేస్తుంది?సమాధానం: ఆకులపై సాకడం ద్వారా వంటను నాశనం చేస్తుంది.
-
సీతాకోకచిలుకలు, తేనెటీగలు పంటకు ఎలా సహాయపడతాయి?సమాధానం: పరాగసంపర్కంలో ముఖ్యపాత్ర వహించి పంట ఫలితాన్ని పెంచుతాయి.
-
కప్పల జీవితచక్రం ఏమిటి?సమాధానం: గుడ్లు → టాడ్‌పోల్ → కాళ్లకలిగిన కప్ప → చిరుకప్ప → పెద్ద కప్ప.
-
టాడ్‌పోల్‌లు నీటిని శుభ్రం చేయడంలో ఎలా సహాయపడతాయి?సమాధానం: శైవలాలను తినడం ద్వారా నీటిని శుభ్రంగా ఉంచుతాయి.
-
పెద్ద కప్పలు పంటకు ఎలా సహాయపడతాయి?సమాధానం: కీటకాలను తినడం ద్వారా పంట ప్రాంతాన్ని కీటక రహితంగా ఉంచుతాయి.
-
పంట సాగులో నీరు ఎందుకు ముఖ్యమైనది?సమాధానం: పంట పెరుగుదలకు, ఫలితాలుకు నీరు అవసరం, కాబట్టి వరిని నీరు ఆధారిత పంట అంటారు.
-
ఒక కిలో వరికి ఎంత నీరు అవసరం?సమాధానం: 3000–5000 లీటర్ల నీరు.
-
నీటి పారుదల అంటే ఏమిటి?సమాధానం: పొలానికి నీటిని సరఫరా చేయడం.
-
క్షేత్రనీటి పారుదల ఏమిటి?సమాధానం: వర్షపాతం తక్కువగా ఉంటే పొలానికి నేరుగా నీరు ఇచ్చే విధానం.
-
చాళ్ళు నీటి పారుదల ఎలా చేస్తారు?సమాధానం: చాళ్లు, కందకాలు ద్వారా నీరు పొలానికి చేరుతుంది.
-
స్ప్రింక్లర్ నీటి పారుదల విధానం ఏమిటి?సమాధానం: పైపుల ద్వారా నియంత్రిత వర్షం వలే నీటిని చల్లించడం.
-
బిందు సేద్యం ఎలా జరుగుతుంది?సమాధానం: నీటి గొట్టంలో చిన్న రంధ్రాలు చేసి, నీరు నేరుగా మొక్కల వేర్లకు చేరుతుంది.
-
వరి సాగులో చదును చేయడం ఎందుకు అవసరం?సమాధానం: మట్టిని నరస్రావుగా చేసి నాట్లకు సిద్ధం చేయడానికి.
-
నాట్లు వేయడం ఎలా జరుగుతుంది?సమాధానం: వరి మడుల నుండి నారును తీసుకుని చదును చేసిన పొలంలో నాటతారు.
-
ఎరువులు పెట్టడం ఎందుకు ముఖ్యం?సమాధానం: మొక్కలకు పోషకాలు అందించి, పంట దిగుబడిని పెంచడానికి.
-
కృమిసంహారకాలు ఎందుకు వాడతారు?సమాధానం: పంటలను కీటకాలు, వ్యాధుల నుండి రక్షించడానికి.
-
వంటకోసిన తరువాత వరిని ఎండబెట్టి ఎందుకు ఉంచుతారు?సమాధానం: గింజలను వేరుచేసి నిల్వ చేయడానికి.
-
తూర్పారబట్టడం/ఎగరబోయడం ఎందుకు చేయబడుతుంది?సమాధానం: గింజలను, ఊకను వేరుచేసి శుద్ధం చేయడానికి.
-
ధాన్యాన్ని గోనెంచులలో నిల్వ చేయడం ఎందుకు?సమాధానం: పంటను సురక్షితంగా నిల్వ చేయడానికి.
-
మరపట్టించడం అంటే ఏమిటి?సమాధానం: నిల్వ చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం.
-
రైతులు పొలాన్ని ఎడ్లతో లేదా ట్రాక్టర్‌తో ఎందుకు దున్నిస్తారు?సమాధానం: పొలాన్ని నరస్రావుగా చేసి పంట నాటడానికి సిద్ధం చేయడానికి.
-
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల ఏమవుతుంది?సమాధానం: శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడం, ఆరోగ్యవంతంగా పెరగడం.
-
రాగి అంబలి, నువ్వులు, పల్లీలు ఎందుకు ఉపయోగపడతాయి?సమాధానం: శక్తి మరియు పోషకాలు అందించడానికి.
-
పిల్లలకు బిస్కెట్లు, ఐస్క్రీమ్ ఎక్కువగా తినడం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?సమాధానం: శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువగా చేరడం, ఆరోగ్య సమస్యలు.
-
మాంసకృత్తులు తినడం ఎందుకు ముఖ్యం?సమాధానం: ప్రోటీన్ అందించడం, శరీర పెరుగుదల, కండరాలు బలపడడం.
-
ధాన్యాలు, కాయధాన్యాలు ఎందుకు తినాలి?సమాధానం: శక్తి, పోషకాలు అందించడం.
-
పంట దిగుబడి పెరగడానికి నీరు, ఎరువులు, సస్యరక్షణ అవసరమా?సమాధానం: అవును, ఇవి పంట ఆరోగ్యాన్ని, ఫలితాన్ని నిర్ధారిస్తాయి.
-
వరి సాగులో పంటల జీవచక్రం ఎలా ఉంటుంది?సమాధానం: మొలక → పూలతో మొక్క → వేర్లు/ధాన్యం → పునరుత్పత్తి.
-
కప్పల వల్ల పొలానికి లాభం ఏమిటి?సమాధానం: టాడ్‌పోల్‌లు నీటిని శుభ్రం చేస్తాయి, పెద్ద కప్పలు కీటకాలను తింటాయి.
-
సీతాకోకచిలుకలు పర్యావరణ సూచికగా ఎందుకు ఉపయోగపడతాయి?సమాధానం: రసాయన కాలుష్యానికి ప్రతిస్పందిస్తూ పర్యావరణ పరిస్థితిని సూచిస్తాయి.
-
వ్యాధులు మరియు కీటకాలు పంటను ఎలా ప్రభావితం చేస్తాయి?సమాధానం: పంటను నాశనం చేయడం, దిగుబడిని తగ్గించడం.
-
సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఏ లాభం?సమాధానం: ఆరోగ్యంగా పెరగడం, వ్యాధుల నివారణ, శక్తి అందడం.
-
మిగతా జీవులు, మనం, పంటల మధ్య సంబంధం ఏమిటి?సమాధానం: జీవులు పంటలను పరాగసంపర్కం, కీటక నియంత్రణ, ఆహారం ద్వారా పరస్పర సహాయపడతాయి.
-
పంటలను ఎరువులు లేకపోతే ఎలా ప్రభావితం చేస్తుంది?సమాధానం: పెరుగుదల తగ్గడం, దిగుబడి తగ్గడం, పోషక లోపం.
-
పంట సాగులో నీటి సరఫరా విభిన్న పద్ధతులు ఏవి?సమాధానం: క్షేత్రనీటి పారుదల, చాళ్ళు, స్ప్రింక్లర్, బిందు సేద్యం.
-
మన ఆరోగ్యం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?సమాధానం: మనం తీసుకునే ఆహారం, శరీరంలో పోషకాలు, శక్తి, వ్యాధుల నిరోధక శక్తి.
Answer by Mrinmoee