చాప్టర్ 5

                                         సంచార జీవనం నుండి స్థిర జీవనం


1.ప్రశ్న: రాతియుగం ఎన్ని దశలుగా విభజించారు?

జవాబు: మూడు దశలు – పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్తరాతి యుగం.


2.ప్రశ్న: పాతరాతి యుగాన్ని ఇంకేమని అంటారు?

జవాబు: పాలియోలిథిక్ యుగం.


3.ప్రశ్న: మధ్యరాతి యుగాన్ని ఇంకేమని అంటారు?

జవాబు: మెసోలిథిక్ యుగం.


4.ప్రశ్న: కొత్తరాతి యుగాన్ని ఇంకేమని అంటారు?

జవాబు: నియోలిథిక్ యుగం.


5.ప్రశ్న: పాతరాతి యుగం కాలపరిమితి ఏది?

జవాబు: BCE 2.6 మిలియన్ల నుండి BCE 10,000 వరకు.


6.ప్రశ్న: మధ్యరాతి యుగం కాలపరిమితి ఏది?

జవాబు: BCE 10,000 నుండి BCE 8000 వరకు.


7.ప్రశ్న: కొత్తరాతి యుగం కాలపరిమితి ఏది?

జవాబు: BCE 8000 నుండి BCE 3000 వరకు.


8.ప్రశ్న: వేట-ఆహార సేకరణ చేసేవారు ఏమి చేసేవారు?

జవాబు: అడవుల నుండి ఫలాలు, మూలాలు సేకరించి, పక్షులు, జంతువులను వేటాడేవారు.


9.ప్రశ్న: "పశుకాపరులు" అంటే ఎవరు?

జవాబు: పశువులను పెంచి జీవనం గడిపేవారు.


10.ప్రశ్న: పురాతత్వ శాస్త్రజ్ఞులు ఏమి చేస్తారు?

జవాబు: తవ్వకాలలో దొరికిన పురాతన వస్తువులను అధ్యయనం చేస్తారు.


11.ప్రశ్న: స్థిరజీవనం అంటే ఏమిటి?

జవాబు: ఒకచోట నివసించడం.


12.ప్రశ్న: రాతి పరికరాలు దేనితో తయారు చేస్తారు?

జవాబు: రాళ్లతో.


13.ప్రశ్న: రోలు రోకలి ఉపయోగం ఏమిటి?

జవాబు: ధాన్యాలను దంచుట.


14.ప్రశ్న: కంచు లోహం అంటే ఏమిటి?

జవాబు: రాగి, టిన్ లోహాల మిశ్రమం.


15.ప్రశ్న: మచ్చిక చేసుకోవడం అంటే ఏమిటి?

జవాబు: కావలసిన మొక్కలు, జంతువులను పెంచుకోవడం.


16.ప్రశ్న: పాతరాతి యుగంలో జీవనం ఎలా ఉండేది?

జవాబు: సంచార జీవనం.


17.ప్రశ్న: నిప్పును మొదట ఎప్పుడు కనుగొన్నారు?

జవాబు: పాతరాతి యుగంలో.


18.ప్రశ్న: నిప్పును ఆది మానవులు దేనికి వాడేవారు?

జవాబు: ఆహారం వండుకోవడానికి, చలిని తరిమివేయడానికి, అడవి జంతువులను తరిమివేయడానికి.


19.ప్రశ్న: ఆది మానవులు ఏ రకమైన గృహాల్లో నివసించేవారు?

జవాబు: గుహల్లో.


20.ప్రశ్న: గుహాచిత్రాలు ఎక్కడ లభించాయి?

జవాబు: ఆంధ్రప్రదేశ్‌లో చింతకుంట, వేల్పుమడుగు మొదలైన ప్రదేశాల్లో.


21.ప్రశ్న: చింతకుంట గుహాచిత్రాలలో ఏ చిత్రాలు కనిపిస్తాయి?

జవాబు: విల్లు అంబులు ధరించిన మానవాకృతులు, ఎద్దు.


22.ప్రశ్న: మధ్యరాతి యుగంలో కొత్త మార్పులు ఏమి జరిగాయి?

జవాబు: జంతువులను మచ్చిక చేసుకోవడం, చేపల వేట, చిన్న రాళ్ల పరికరాలు వాడటం.


23.ప్రశ్న: కొత్తరాతి యుగంలో ప్రధాన మార్పు ఏమిటి?

జవాబు: వ్యవసాయం ఆరంభం.


24.ప్రశ్న: ధాన్యాలను ఆది మానవులు ఎక్కడ నిల్వ చేసేవారు?

జవాబు: మట్టి పాత్రల్లో, గుంటల్లో.


25.ప్రశ్న: వంటరు రుబ్బురోలు లేకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి?

జవాబు: ధాన్యం దంచలేము, ఆహారపు అలవాట్లు మారిపోతాయి.


26.ప్రశ్న: ఆది మానవులు ఏ జంతువులను మచ్చిక చేసుకున్నారు?

జవాబు: కుక్క, మేక, ఆవు మొదలైనవి.


27.ప్రశ్న: ఆది మానవులు ఏ పంటలు పండించారు?

జవాబు: బియ్యం, గోధుమ, జొన్నలు.


28.ప్రశ్న: రాతిపరికరాలను ఏ పనులకు వాడేవారు?

జవాబు: వేట, వంట, కట్టడం.


29.ప్రశ్న: ఆది మానవుల జీవనం ఏ విధంగా మారింది?

జవాబు: సంచార జీవనం నుండి స్థిరజీవనానికి.


30.ప్రశ్న: నాగరికతల ఆరంభం ఎప్పుడు జరిగింది?

జవాబు: కొత్తరాతి యుగంలో.


Answer by Mrinmoee