Chapter 3    

గాలిలోని రేణురూప కలుషితాలను అంచనా వేద్దాల



1. గాలిలో ఉండే ఘన, ద్రవ రూప రేణువులను ఏమంటారు?

సమాధానం: రేణురూప కలుషితాలు (ఏరోసాల్స్) అంటారు.

2. గాలిలో రేణురూప కలుషితాలు ఎక్కువైతే ఏమవుతుంది?

సమాధానం: గాలి కాలుష్యం ఏర్పడుతుంది.

3. గాలిలో కనిపించే కొన్ని రేణురూప కలుషితాలేంటీ?

సమాధానం: దుమ్ము, పరాగరేణువులు, పొగ, బూడిద, వాహనాల పొగ, బొగ్గు, సిమెంట్ రేణువులు.

4. రేణురూప కలుషితాలు సూర్యకిరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

సమాధానం: సూర్యకిరణాలు భూమికి చేరకుండా అడ్డుకుంటాయి.

5. భూమి వేడెక్కడానికి రేణురూప కలుషితాలు ఎలా కారణం అవుతాయి?

సమాధానం: భూ ఉపరితల ఉష్ణం వాతావరణానికి పోకుండా అడ్డుకుంటాయి.

6. రేణురూప కలుషితాల వల్ల మన ఆరోగ్యానికి వచ్చే సమస్యలేమిటి?

సమాధానం: శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి.

7. రేణురూప కలుషితాలు కాంతిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

సమాధానం: కాంతిని శోషించి వస్తువులను సరిగా కనిపించకుండా చేస్తాయి.

8. గాలిలోకి ఏవేవి రేణురూప కలుషితాలు చేరతాయి?

సమాధానం: హిట్ స్ప్రేలు, ఫంక్షన్ ఫోమ్ స్ప్రేలు, డియోడరెంట్లు, పెర్ఫ్యూములు, రంగులు వాడటం వల్ల.

9. పరిశ్రమల వల్ల గాలిలో కలుషితాలు ఎలా చేరుతాయి?

సమాధానం: పరిశ్రమల నుంచి వెలువడే ధూళి మరియు వ్యర్థాల ద్వారా.

10. ఏరోసాల్స్ ఎక్కువైతే వాతావరణంలో ఏ మార్పులు జరుగుతాయి?

సమాధానం: భూ వాతావరణం వేడిగా మారుతుంది.

11. స్లైడ్ ప్రయోగంలో వాసిలిన్ ఎందుకు పూయాలి?

సమాధానం: గాలిలో ఉన్న రేణువులను పట్టుకునేందుకు.

12. రేణుల పరిశీలన కోసం ఏమి ఉపయోగిస్తారు?

సమాధానం: భూతద్దం లేదా మైక్రోస్కోపు.

13. ఇంట్లో ఎక్కడ ఎక్కువగా ధూళి చేరుతుంది?

సమాధానం: ఇంటి పైకప్పు, కిటికీ గట్టి, గదుల్లో.

14. ఏ ప్రదేశాలలో ఎక్కువ రేణులు కనిపించాయి?

సమాధానం: బహిరంగ ప్రదేశాలు — ఇంటి పైకప్పు, తోట మొదలైనవి.

15. రేణుల పరిమాణం సీజన్లకి అనుసరించి మారుతుందా?

సమాధానం: అవును, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి మారుతుంది.

16. గాలిలో ఉన్న కాలుష్యం వృక్షజాలంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సమాధానం: ఫోటోసింథసిస్ తగ్గిపోతుంది.

17. భూ వాతావరణం వేడిగా మారితే జీవజాలంపై ప్రభావం ఏంటి?

సమాధానం: జీవుల జీవనశైలి మారిపోతుంది, కొందరి మరణం కూడా సంభవించవచ్చు.

18. రేణుల కలుషణం వలన మనకు ఏర్పడే ఆరోగ్య సమస్యలేమిటి?

సమాధానం: ఆస్తమా, శ్వాసకోశ రుగ్మతలు.

19. పొగ మేఘాల వల్ల ఆకాశం ఎలా కనిపిస్తుంది?

సమాధానం: పొగమేఘాలతో నిండినట్టు, మబ్బుగా కనిపిస్తుంది.

20. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం తీసుకోవలసిన చర్యలేమిటి?

సమాధానం: పరిశ్రమల నియంత్రణ, రసాయన పదార్థాల వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం.