Chapter 7
1.మొక్కలు నీటిని ఎక్కడి నుండి గ్రహిస్తాయి?
సమాధానం:→ నేల నుండి.
2.మొక్కలు ఖనిజ పోషకాలను ఎక్కడి నుండి గ్రహిస్తాయి?
సమాధానం:→ నేల నుండి.
3.నీరు ఆవిరయ్యే ప్రక్రియను ఏమంటారు?
సమాధానం:→ భాష్పోత్సేకం.
4.భాష్పోత్సేకం ఏ భాగం ద్వారా జరుగుతుంది?
సమాధానం:→ పత్రరంధ్రాల ద్వారా.
5.ఆకులలో ఉండే చిన్న రంధ్రాలను ఏమంటారు?
సమాధానం:→ పత్రరంధ్రాలు.
6.మొక్కలు భాష్పోత్సేకం ద్వారా ఏమి విడుదల చేస్తాయి?
సమాధానం:→ నీరు.
7.పొడవైన చెట్లలో నీటిని పైకి లాగే శక్తి ఏమిటి?
సమాధానం:→ చూషణ ఒత్తిడి.
8.భాష్పోత్సేకం ద్వారా మొక్కలకు కలిగే లాభం ఏమిటి?
సమాధానం:→ మొక్కలు చల్లగా ఉంటాయి.
9.రక్తం శరీరంలో ఏమి పంపిణీ చేస్తుంది?
సమాధానం:→ ఆహారం మరియు ఆమ్లజని.
10.రక్తం శరీరంలో ఏమి తొలగిస్తుంది?
సమాధానం:→ వ్యర్థ పదార్థాలను.
11మానవ ప్రసరణ వ్యవస్థలో ప్రధాన అవయవం ఏమిటి?
సమాధానం:.→ గుండె.
12.గుండె ఏమి చేస్తుంది?
సమాధానం:→ రక్తాన్ని పంపిస్తుంది.
13.రక్త నాళాలు ఎన్ని రకాలుగా ఉంటాయి?
సమాధానం:→ రెండు (ధమని, సిర).
14.రక్తం ఎర్రగా కనిపించడానికి కారణం ఏమిటి?
సమాధానం:→ హీమోగ్లోబిన్.
15.ఎర్ర రక్త కణాలను ఇంకేమంటారు?
సమాధానం:→ ఆర్‌బిసి.
16.తెల్ల రక్త కణాలను ఇంకేమంటారు?
సమాధానం:→ డబ్ల్యూబిసి.
17.రక్తం గడ్డకట్టడానికి సహాయపడేవి ఏమిటి?
సమాధానం:→ రక్త ఫలకికలు.
18.రక్తం లోని ద్రవ భాగం ఏమంటారు?
సమాధానం:→ ప్లాస్మా.
19.వ్యర్థ పదార్థాలు శరీరం నుండి ఏ విధంగా బయటకు వెళ్తాయి?
సమాధానం:→ విసర్జన ద్వారా.
20.మూత్రాన్ని నిల్వ చేసేది ఏది?
సమాధానం:→ మూత్రాశయం.
21.మూత్రపిండాల పని ఏమిటి?
సమాధానం:→ రక్తం శుద్ధి చేయడం.
22.మూలకేశం ఏ అవయవంలో ఉంటుంది?
సమాధానం:→ వేరు.
23.చెమట ద్వారా శరీరం నుండి ఏమి బయటకు వెళ్తుంది?
సమాధానం:→ నీరు మరియు ఉప్పు.
24.శ్వాసక్రియకు అవసరమైన వాయువు ఏది?
సమాధానం:→ ఆమ్లజని.
25.రక్తనాళాల్లో చిన్న నాళాలు ఏవి?
సమాధానం:→ కేశనాళికలు.
26.మొక్కలు నీటిని వేరు నుండి ఆకుల వరకు ఎలా రవాణా చేస్తాయో వివరించండి.
సమాధానం:→ మొక్కల వేరు నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తాయి. ఈ నీరు కాండం ద్వారా పైకి చేరుతుంది. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరవుతుంది. ఈ భాష్పోత్సేకం వల్ల చూషణ ఒత్తిడి ఏర్పడి నీరు పైకి లాగబడుతుంది.
27.భాష్పోత్సేకం ప్రక్రియను వివరించండి.
సమాధానం:→ భాష్పోత్సేకం అనేది ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియ. దీని ద్వారా మొక్కలు వినియోగించని నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రక్రియ వల్ల మొక్కలు చల్లబడతాయి మరియు నీరు పైకి లాగబడుతుంది.
28.గుండె యొక్క నిర్మాణం మరియు పనిని వివరించండి.
సమాధానం:→ గుండె మన శరీరంలో రక్తాన్ని పంపించే ముఖ్య అవయవం. ఇది నాలుగు గదులుగా ఉంటుంది: రెండు అలిండాలు, రెండు వంట్రికల్స్. ఇది కుదుస్తూ, విడుస్తూ రక్తాన్ని ధమనుల ద్వారా పంపుతుంది.
29.రక్తం యొక్క ప్రధాన భాగాలను వివరించండి.
సమాధానం:→ రక్తం లో ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు ఉంటాయి. ప్లాస్మా పోషకాలను తీసుకెళ్తుంది. ఆర్‌బిసి హీమోగ్లోబిన్ కలిగి ఆమ్లజని రవాణా చేస్తుంది. డబ్ల్యూబిసి రోగాలను నిరోధిస్తుంది. రక్త ఫలకికలు గడ్డకట్టడానికి సహాయపడతాయి.
30.విసర్జక వ్యవస్థ పనులను వివరించండి.
సమాధానం:→ విసర్జక వ్యవస్థ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలో ఏర్పడే యూరియా, యూరిక్ ఆమ్లం, చెమట వంటివి ఈ వ్యవస్థ ద్వారా బయటకు వెళ్తాయి.
Answer by Mrinmoee