Chapter 1
అకరణీయ సంఖ్యలు
1. సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృతమని నిరూపించండి.
సమాధానం: ఉదా: 5+7=12, ఇది సహజ సంఖ్యే. కాబట్టి సంకలనం దృష్ట్యా సంవృతం.
2. సహజ సంఖ్యలు వ్యత్యాసంలో సంవృతం కావని నిరూపించండి.
సమాధానం: 4−9=−5, ఇది సహజ సంఖ్య కాదు. కాబట్టి సంవృతం కాదు.
3. సహజ సంఖ్యలు గుణకారంలో సంవృతమని నిరూపించండి.
సమాధానం: 6×3=18, ఇది సహజ సంఖ్యే. కాబట్టి సంవృతం.
4. సహజ సంఖ్యలు భాగహారంలో సంవృతం కావని చూపండి.
సమాధానం: 5÷2=2.5 వస్తుంది, ఇది సహజ సంఖ్య కాదు. కాబట్టి సంవృతం కాదు.
5. సహజ సంఖ్యలు సంకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయని ఉదాహరణతో చూపండి.
సమాధానం: 7+9=16, 9+7=16. ఇరువైపులా సమానమే. కాబట్టి స్థిత్యంతరం ఉంది.
6. సహజ సంఖ్యలు వ్యత్యాసంలో స్థిత్యంతర ధర్మం పాటించవని చూపండి.
సమాధానం: 8−5=3, కానీ 5−8=−3 వస్తుంది. కాబట్టి స్థిత్యంతరం కాదు.
7. సహజ సంఖ్యలు గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయని నిరూపించండి.
సమాధానం: 4×6=24, 6×4=24. సమానం కాబట్టి స్థిత్యంతరం ఉంది.
8. సహజ సంఖ్యలు భాగహారంలో స్థిత్యంతరం పాటించవని చూపండి.
సమాధానం: 8÷4=2 (సహజం), 4÷8=0.5 (సహజం కాదు). కాబట్టి స్థిత్యంతరం కాదు.
పూర్ణ సంఖ్యలు (Whole Numbers)
9. పూర్ణ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృతమని నిరూపించండి.
సమాధానం: 0+9=9 వస్తుంది. ఇది పూర్ణ సంఖ్యే. కాబట్టి సంవృతం.
10. పూర్ణ సంఖ్యలు వ్యత్యాసంలో సంవృతం కావని ఉదాహరణతో చూపండి.
సమాధానం: 3−7=−4 వస్తుంది, ఇది పూర్ణ సంఖ్య కాదు. కాబట్టి సంవృతం కాదు.
11. పూర్ణ సంఖ్యలు గుణకారంలో సంవృతమని నిరూపించండి.
సమాధానం: 0×6=0 వస్తుంది, ఇది పూర్ణ సంఖ్యే. కాబట్టి సంవృతం.
12. పూర్ణ సంఖ్యలు భాగహారంలో సంవృతం కావని చూపండి.
సమాధానం: 5÷2=2.5 వస్తుంది, ఇది పూర్ణ సంఖ్య కాదు. కాబట్టి సంవృతం కాదు.
13. పూర్ణ సంఖ్యలు సంకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయని నిరూపించండి.
సమాధానం: 12+4=16, 4+12=16. సమానం కాబట్టి స్థిత్యంతరం ఉంది.
14. పూర్ణ సంఖ్యలు వ్యత్యాసంలో స్థిత్యంతరం పాటించవని నిరూపించండి.
సమాధానం: 9−4=5, కానీ 4−9=−5 (పూర్ణ సంఖ్య కాదు). కాబట్టి స్థిత్యంతరం లేదు.
15. పూర్ణ సంఖ్యలు గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయని నిరూపించండి.
సమాధానం: 3×8=24, 8×3=24. సమానం కాబట్టి స్థిత్యంతరం ఉంది.
16. పూర్ణ సంఖ్యలు భాగహారంలో స్థిత్యంతరం పాటించవని చూపండి.
సమాధానం: 10÷2=5 (పూర్ణం), కానీ 2÷10=0.2 (పూర్ణం కాదు). కాబట్టి స్థిత్యంతరం లేదు.
పూర్ణాంకాలు (Integers)
17. పూర్ణాంకాలు సంకలనం దృష్ట్యా సంవృతమని నిరూపించండి.
సమాధానం: −3+7=4 వస్తుంది, ఇది కూడా పూర్ణాంకమే. కాబట్టి సంవృతం.
18. పూర్ణాంకాలు వ్యత్యాసంలో సంవృతమని చూపండి.
సమాధానం: 4−9=−5 వస్తుంది, ఇది పూర్ణాంకమే. కాబట్టి సంవృతం.
19. పూర్ణాంకాలు గుణకారంలో సంవృతమని నిరూపించండి.
సమాధానం: −3×5=−15 వస్తుంది, ఇది పూర్ణాంకమే. కాబట్టి సంవృతం.
20. పూర్ణాంకాలు భాగహారంలో సంవృతం కావని నిరూపించండి.
సమాధానం: 7÷2=3.5 వస్తుంది, ఇది పూర్ణాంకం కాదు. కాబట్టి సంవృతం కాదు.
Answer by Mrinmoee